Rajagopal Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో వివిధ వేదికలపై తరచూ కాంగ్రెస్ పార్టీలో తనకు అడ్డు తగులుతున్నారనుకున్న నేతలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన తన అసంతృప్తిని చెప్పకనే చెప్తున్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajagopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తలేడు.. అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి వద్దకు వెళ్లినా బిల్లులు ఇవ్వడం లేదని తెలిపారు. పనులు చేయమంటే బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్లు మెలిక పెడుతున్నారని చెప్పారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉన్నదని తెలిపారు.
Rajagopal Reddy: తనకు మంత్రి పదవి ఎట్లాగూ ఇస్తలేరు.. తనకు న్యాయం చేయకున్నా పర్వాలేదు.. కానీ కాంట్రాక్టర్లకు, నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. మంత్రి పదవి తనకు ఎట్ల రావాల్నో అలాగే వస్తుందని, దానిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టంచేశారు. పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, తనకు పదవి వస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
Rajagopal Reddy: పదవులు మీకే.. పైసలూ మీకేనా? అని ఓ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తాను సీఎం రేవంత్‌రెడ్డితో కొట్లాడుతున్న, తనకంటే మంచి నాయకుడు మీకు దొరుకుతడా? అని నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ, నియోజకవర్గ ప్రజలకు పైసలు ఇవ్వండి అని హితవు పలికారు.