Telangana BJP

Telangana BJP: బీజేపీలో కిషన్ రెడ్డి vs రాజాసింగ్

Telangana BJP: కమలం పార్టీలో నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రరూపం దాల్చింది.!! నేతలకు ఒకరికి ఒకరికి అస్సలు పడటం లేదు అంట. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ అందరం కలసి కట్టుగా ఉన్నామని నటించే బీజేపీ నేతలు ప్రస్తుతం బహిరంగంగానే విమర్శలు చేసుకొంటున్నారు..

వార్తల్లో నిలవాలి అని హాట్ కామెంట్ చేస్తారా ? అని అడిగితే… కార్యకర్తల మాటే నా మాట అని అంటారు ఆ ఎమ్మెల్యే? ఎందుకు ఆ ఎంపీ పై అంత కోపం?? అస్సలు ఎవరు ఆ ఎమ్మెల్యే? ఎవరు ఆ ఎంపీ ? లెట్స్ వాచ్ ది స్టోరీ..

కమలం పార్టీలో కోల్డ్ వార్ తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారని,  సందర్భం ఏదైనా సరే ఇండైరెక్ట్ గా రాష్ట్ర అధ్యక్షుడు, కమిటీ పై విమర్శలు గుప్పిస్తూ వరుసుగా వార్తల్లో నిలుస్తూ ఉండటంతో  చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

రాష్ట్ర నూతన అధ్యక్షుడు నియామకం గురించి చర్చకు వచ్చిన నేపథ్యంలో రాజాసింగ్ వాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అధ్యక్షున్నీ స్టేట్ కమిటీ నియమిస్తే రబ్బరు స్టాంపుగా మిగిలిపోతారు. ప్రస్తుత రాష్ట్ర అధిష్ఠానం ఎంపీ, ఎంఎల్ఏ ల కాళ్ళు, చేతులు కట్టి పడేశారు.పార్టీ కోసం జైలుకి వెళ్ళిన వారికి,కష్ట పడ్డవారికి అవకాశం ఇవ్వాలి.ఇది నా మాట కాదు. కార్యకర్తల మనుసులో ఉన్న మాట నేను చెప్తున్నానాని అంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ అన్ని పోస్టులు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో  మెంబర్స్ కి వస్తాయా? మీకు గులాంగిరి చేసిన వారికే పోస్టులు, పదవులు ఇచ్చుకుంటారా, … మిగతావాళ్లు మీకు గులాంగిరి చేయరు!! అందుకే వాళ్లను పక్కకు పెడుతున్నారు అంటూ ఘాటు వాఖ్యలు చేశారు రాజసింగ్. ఈ వాఖ్యలతో ఒక్కసారిగా ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య విభేదాలు మరోసారి  బట్టబయలు అయ్యాయి.

నాయకుల మధ్య ఇలా కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్ గా మారితే ఇబ్బందులు తప్పవు అని కమలం కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో వీటన్నిటికీ కేంద్ర పార్టీ నాయకులు చెక్ పెట్టాలనీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ALSO READ  Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *