R Krishnaiah: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రిజర్వేషన్లను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని, కాంగ్రెస్‌కు చేతకాక కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారమే!
“బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకం” అని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
రేపు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా:
బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం (ఆగస్టు 2) ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలంతా ఈ ధర్నాలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.