Pushpa-2: మరి కొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ‘పుష్ప2’. ఇప్పటికే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కొన్ని చోట్ల రికార్డ్స్ బద్దలు అవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ సినిమా టిక్కెట్ రేట్లు యమ ఖరీదు అనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ రేట్ పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. దాని ప్రకారం 4వ తేదీన ప్రీమియర్ షోలకు రూ. 1121 నుంచి రూ1239వరకూ, మొదటి నాలుగు రోజులు రూ. 354 నుంచి రూ.531వరకూ, 5వ రోజు నుంచి రూ 472 వరకూ, 13వ రోజు నుంచి 29 వరకూ రూ. 354 వరకూ పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Unstoppable with NBK S4: అదుర్స్ అనేలా శ్రీలీల, నవీన్ అన్ స్టాపబుల్ ప్రోమో!?
Pushpa-2: ఇక నార్త్ అయితే కొన్ని చోట్ల టిక్కెట్ రేట్స్ చూస్తే మతి పోతోంది. పి.వి.ఆర్ ముంబైలో టిక్కెట్ రేటు 3.000, డిల్లీలో 2,400, 1860వరకూ ఉండగా ఇతర ముఖ్య పట్టణాల్లో రూ.1500 నుంచి రూ. 1700 వరకూ ఉంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తోంది. అంతే కాదు బన్నీ ఇటీవల తన స్పీచ్ లో 10రూ బిస్సెట్ ప్యాకెట్ ను పది రూపాయలకే కొంటాను. కోట్లు ఉన్నాయి కదా అని ఎక్కువకు కొనను అన్న విషయాన్ని కోట్ చేస్తున్నారు. తనకో రూల్ ఫ్యాన్స్ కో రూలా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా రేట్లు పెంచి ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేయటం ఎంత వరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పెంచిన రేట్లు ‘పుష్ప2’కి వరం అవుతాయో? శాపంగా మారతాయో చూడాలి.