Pushpa 2: నాన్ థియేట్రికల్ బిజినెస్ లో 'పుష్ప-2' రికార్డ్!

Pushpa 2: నాన్ థియేట్రికల్ బిజినెస్ లో ‘పుష్ప-2’ రికార్డ్!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారంతో పూర్తి కాబోతోంది. 4వ తేదీ నుండి ఐటమ్ సాంగ్ చిత్రీకరణ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. గురువారం ఈ సినిమా అదర్ స్టేట్స్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఒక రోజు ముందే డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నామని తెలిపారు.

నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘పుష్ప-2’ సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని, దాదాపు రూ. 400 కోట్ల బిజినెస్ జరిగిందని నవీన్ ఎర్నేని తెలిపారు. బెంగాలీతో కలిపి ఆరు భాషల్లో ‘పుష్ప-2’ను విడుదల చేయబోతున్నామని, ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కేంద్రాలలో ఇది ప్రదర్శితమౌతుందని అన్నారు. ‘పుష్ప-2’కు కొనసాగింపుగా ‘పుష్ప-2’ ఖచ్చితంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. మొదటి భాగాన్ని మించిన ‘పుష్ప-2’ ఘన విజయం సాధిస్తుందని, తమ రాష్ట్రాలలో ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని పంపిణీదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nallagonda: యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్కేంద్రం జాతికి అంకితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *