Night Time: జంక్ ఫుడ్ , స్నాక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. కానీ తినకుండా ఉండలేరు. అయితే పరిమితంగా ఆహారం తీసుకోవడం మంచిది. ఇక రాత్రిపూట చిప్స్, ఐస్‌క్రీం, ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటే ఆరోగ్యం పాడు చేసుకున్నట్లే. భోజనం తర్వాత పడుకునే ముందు చాలా మంది స్నాక్స్ తింటారు. ఆకలి, అలసట, ఒత్తిడి వల్ల కూడా తింటారు. అయితే రాత్రి తినే స్నాక్స్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: White Hair: పెరుగులో ఈ పొడి కలిపి రాస్తే .. తెల్ల జుట్టు మాయం
చిప్స్ తినడం
Night Time: జీవక్రియ తక్కువగా ఉన్నప్పుడు, శరీరం అదనపు శక్తిని ఉపయోగించకుండా కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. పడుకునే ముందు సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం వల్ల బాగా నిద్రపోతారు. బాదం, జీడిపప్పు తినడం వల్ల మంచి నిద్రకు సంబంధించిన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అర్ధరాత్రి తినే స్నాక్స్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అర్ధరాత్రి స్నాక్స్ కడుపు నొప్పి, గుండెల్లో మంట,యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. వేయించిన, జున్ను, మసాలా ఆహారాన్ని తినకుండా ఉండడం బెటర్.
ఇవి తినాలి
Night Time: రోజంతా సమతుల్య ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్, కొవ్వు, మాంసకృత్తులు, ఫైబర్ ఉన్న ఆహారం తినాలి. వేయించిన, చక్కెర, కెఫిన్ కలిగిన ఆహారాలు, పానీయాలను వీలైనంత వరకు తగ్గించాలి. ఇది కడుపు నొప్పి, నిద్రలేమికి కారణమవుతుంది.