Prashanth Neel: గేమ్ చేంజర్ లాంటి అట్టర్ ప్లాప్ తరువాత.. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తుండగా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎగ్జైటెడ్ గా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ లైనప్ లో సుకుమార్ ఉన్నాడు.కానీ లేటెస్ట్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ కోసం చాలా మంది సినీ ప్రియులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ కాంబినేషన్లో అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రావచ్చని టాక్. ఈ సినిమాని చరణ్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నట్టుగా టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.
