NTR-Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో భారీ చిత్రం రానుంది. ఈ సినిమాలోనూ మదర్ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తున్నాడట ప్రశాంత్ నీల్. నిజానికి ప్రశాంత్ పేయింగ్ ఎలిమెంట్ కూడా అదే. తను తీసిన ‘కెజిఎఫ్’ సీరీస్ కానీ, ప్రభాస్ ‘సలార్’ కానీ మదర్ సెంటిమెంట్ ఆధారంగా తీసినవే. అయితే దానికి యాక్షన్ జోడించి భారీ స్పాన్ తో ఆ సినిమాలను తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్. ఆ సెంటిమెంట్ లో ఎమోషన్ పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తాడు. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాలు వయోలెంట్ గా ఉన్నా సెంటిమెంట్ తో ఆకట్టుకుంటాయి.
ఇక మదర్ సెంటిమెంట్ కి పడిపోని సాధారణ ప్రేక్షకులు ఉంటారా!? తాజాగా ప్రశాంత్ నీల్ కథ సమకూర్చిన ‘బఘీరా’ కూడా మదర్ సెంటిమెంట్ బేస్ తో ఉన్నదే. ట్రైలర్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కూడా మదర్ సెంటిమెంట్ బేస్ చేసుకునే ఉంటుందట. అందుకే ఎన్టీఆర్ మదర్ గా పేరున్న నటిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. డాన్స్, ఫైట్స్ లోనే కాదు సెంటిమెంట్ పండించటంలోనూ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే ఎన్టీఆర్ కి సరితూగగల నటి కోసం చూస్తున్నాడట. మరి ఎన్టీఆర్ కి తల్లిగా నటించబోయే నటి ఎవరో చూడాలి.