Prashant kishor: బీహార్‌లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ అనే పార్టీని ప్రారంభించారు. గత డిసెంబర్‌లో జరిగిన ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ 2వ తేదీన పాట్నాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
నిన్న ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో నిన్న ప్రశాంత్ కిషోర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు.
కాగా కొంతకాలంగా పరీక్షల రద్దు కోసం విద్యార్థులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఆందోళనల్లో నేరుగా పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన ఆమరణ నిరాదీక్షకు కూచున్నారు. దీంతో పోలీసులు నిన్న ఆయన దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.