Pooja Hegde: మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్ #AA22xA6) భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్‌లో నటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న పూజా హెగ్డేకు ఈ అవకాశం మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి డాన్స్ చేసే అరుదైన అవకాశం కల్పిస్తోంది.
Also Read: Ram Charan-Upasana: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన
ఒక్క పాటకే రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్!
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఒక్క స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నిమిషాల పాట కోసం ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలురాణి’, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ప్రత్యేక పాటలు చేసిన పూజ, మరోసారి తన గ్లామర్, డాన్స్ తో ఈ పాటను ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
అల్లు అర్జున్ యాక్షన్, అట్లీ మాస్ ఎంటర్టైన్మెంట్ కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దాదాపు రూ. 700-800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కే రూ. 250 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయం సాధిస్తే, పూజా హెగ్డే కెరీర్‌కు మరో పెద్ద బూస్ట్ లభించే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో దీపికా పదుకొణేతో పాటు, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్, రష్మిక వంటి పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, పూజా హెగ్డే రాక ఈ ప్రాజెక్టుకు మరింత ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.