Heart Stroke

Heart Stroke: గుండెపోటు భయం పట్టుకుందా..? అయితే ఈ చిట్కాలు పాటించండి..

Heart Stroke: ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే.. మన తినే ఆహారం, అనుసరిస్తున్న అనారోగ్యకరమైన జీవనశైలి గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు. చాలా మంది రుచిగా ఉండే ఆహారాలు తింటారు. కానీ అవి ఆరోగ్యానికి మంచివా అని ఆలోచించరు. అయితే ఆరోగ్యం అదుపు తప్పకుండా ఉండటానికి కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ పద్ధతులు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక ఉప్పు
సాధారణంగా రోజూ తీసుకునే ఉప్పు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే వంటల్లో తక్కువ ఉప్పు వాడలి.

పండ్లు, కూరగాయలు :
పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తినాలి. వాటిలో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అందువల్ల వైద్యులు ప్రతిరోజూ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలను తినాలని సిఫార్సు చేస్తారు.

ఇది కూడా చదవండి: Periods Problems: ఇర్రెగ్యులర్ పీరియడ్స్.. ఇంట్లోనే పరిష్కారం

వ్యాయామం :
రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె బలపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

అల్లం – వెల్లుల్లి
అల్లం, వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంతో పాటు మంటను తగ్గిస్తుంది. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

ఒత్తిడి
ఒత్తిడి శరీరానికి మంచిది కాదు. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా మీకు నచ్చిన ఇతర విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించాలి. అంతేకాకుండా నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

నారింజ పండ్లు :
నారింజ పండ్లలో సాధారణంగా విటమిన్ సి ఉంటుంది. ఇది రక్త నాళాలను బలపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నారింజ మాత్రమే కాదు, నిమ్మకాయలు, ద్రాక్ష, ఇతర సిట్రస్ పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

నిద్ర :
నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ప్రతి రాత్రి 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఎందుకంటే సరైన నిద్ర శరీర బరువును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది. ఈ చిట్కాలను సరిగ్గా పాటించడం ద్వారా మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ALSO READ  Raw Vegetables: ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి, ఎందుకంటే ?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *