PM Modi in laos: భారత్-ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం కమ్యూనిస్ట్ దేశం లావోస్ చేరుకున్నారు. భారత్-ఆసియాన్ సదస్సులో మోదీ ప్రసంగించారు. “నేను భారతదేశపు యాక్ట్-ఈస్ట్ పాలసీని ప్రకటించాను. గత దశాబ్దంలో, ఈ విధానం భారతదేశం – ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలకు కొత్త శక్తిని, దిశను అందించింది.”
“గత 10 ఏళ్లలో, ఆసియాన్ ప్రాంతాలతో మా వాణిజ్యం దాదాపు రెట్టింపు పెరిగి 130 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మనది శాంతిని ప్రేమించే దేశం.” అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశాన్నిచ్చారు.
PM Modi in laos: లావోస్‌లో భారత్-బ్రూనై మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. భారత్‌కు 7 ఆసియాన్ దేశాలతో నేరుగా విమాన కనెక్టివిటీ ఉందని చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ “21వ శతాబ్దం భారతదేశం -ఆసియాన్ దేశాల శతాబ్దమని నేను నమ్ముతున్నాను. నేడు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సంఘర్షణ,ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, భారతదేశం – ASEAN మధ్య స్నేహం, సంభాషణ అలాగే సహకారం చాలా ముఖ్యమైనది.” అని చెప్పారు.
PM Modi in laos: అంతకుముందు లావోస్ చేరుకున్న ఆయనకు బౌద్ధ సన్యాసులు స్వాగతం పలికారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో లావోస్ రామాయణాన్ని కూడా ప్రధాని మోదీ వీక్షించారు. లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ 10వ సారి హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సమయంలో, ప్రధాని మోదీ ఆసియాన్ దేశాలకు చెందిన పలువురు నాయకులతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. లావో ప్రధాని సోనెక్సే సిఫాండన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. లావోస్ ఈ సంవత్సరం ఇండియా-ఆసియాన్ సమ్మిట్ అదేవిధంగా ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లకు ఆతిథ్యం ఇస్తోంది.
PM Modi in laos: సాయంత్రం వియంటియాన్‌లో జపాన్ ప్రధాని ఇషిబాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశం తర్వాత, ప్రధాని మోదీ X లో పోస్ట్ చేసి, జపాన్ ప్రధాని ఇషిబాను కలవడం సంతోషంగా ఉందని రాశారు. సెమీకండక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, డిఫెన్స్ తదితర రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.
అనంతరం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరువురి మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డెయిరీ, అంతరిక్షం, పర్యాటకం వంటి అంశాలపై చర్చలు జరిపారు.
Also Read: రతన్ టాటా మరణాన్ని తలుచుకొని కన్నీరు పెట్టిన పీయూష్ గోయల్
సమావేశం అనంతరం న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ మాట్లాడుతూ తాను భారత్‌కు వీరాభిమానినని, అది తనకు ఎంతో ఇష్టమైన దేశమని అన్నారు.
PM Modi in laos: మోదీ ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది, మోదీ ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కోణంలో కూడా ఈ పర్యటన చాలా ముఖ్యమైనది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ అనేది భారతదేశ దౌత్యంలో ముఖ్యమైన భాగం, ఇది ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించింది.
2014లో భారత ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధానాన్ని ప్రకటించారు. ఈ పాలసీ మాజీ ప్రధాని నరసింహారావు 1992లో ప్రారంభించిన లుక్ ఈస్ట్ పాలసీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పరిగణిస్తారు. అంతకుముందు సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ దక్షిణాసియా దేశాలైన బ్రూనై, సింగపూర్‌లలో పర్యటించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఆగస్ట్‌లో తైమూర్-లెస్టే సందర్శించారు.

