paracetamol: తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, మన ఆరోగ్యంలో ఏ చిన్న మార్పు వచ్చినా, మన చేతులు వెంటనే పారాసిటమాల్‌కు చేరతాయి. పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు పారాసెటమాల్ వాడతారు. ఆరోగ్యం బాగోలేకపోతే నేరుగా పారాసిటమాల్ కార్టన్ కొని వాడటం మొదలుపెడతాం. అయితే ఈ మాత్రలు అన్ని వయసుల వారికి మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. పారాసెటమాల్ మాత్రలు సాధారణంగా జ్వరం, తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు చాలామంది వైద్యులను సంప్రదించకుండానే పారాసెటమాల్ వాడతారు.
పిల్లలు, పెద్దలు విరివిగా వాడే పారాసిటమాల్ ను 65 ఏళ్లు పైబడిన వారికి వాడకూడదని ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు అధిక మోతాదులో పారాసెటమాల్‌ను వాడితే తీవ్రమైన గుండె, కడుపు , మోకాళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
paracetamol: 65 ఏళ్లు పైబడిన వారిపై ఈ అధ్యయనం జరిగింది. 65 ఏళ్లు పైబడిన వారిలో దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల జీర్ణకోశ, గుండె, కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని ఆ అధ్యయనం కనుగొంది. అలాగే, స్ట్రోక్‌తో బాధపడుతున్న రోగులలో నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ మాత్రలు ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల వారి గుండె, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. వైద్యుల సలహా లేకుండా పారాసెటమాల్ తీసుకోకూడదు. మీకు నొప్పి లేదా జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.