PM Modi

PM Modi: 103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: రైల్వే రంగంలో ఆధునీకరణకు మరో ముందడుగు వేసిన కేంద్ర ప్రభుత్వం, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యాధునికంగా అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను జాతికి అంకితమిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని ఒక కార్యక్రమం నుంచి వర్చువల్‌గా ఈ స్టేషన్లను ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించడం విశేషం. దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర, రైలు ప్రయాణాల భవిష్యత్‌ విధానం వంటి అంశాలపై ప్రధాన మంత్రి చర్చించారు.

ఈ ప్రారంభించిన స్టేషన్లలో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట స్టేషన్‌ కూడా ఇందులో భాగంగా అభివృద్ధి చెంది ప్రారంభమైంది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యాలు:

  • రైల్వే స్టేషన్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించడం

  • మరింత సౌకర్యవంతమైన సేవలు, శుభ్రమైన వాతావరణం కల్పించడం

  • స్థానిక భవన నిర్మాణ శైలి, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా స్టేషన్ల రూపకల్పన

  • డ్రాప్ & పిక్‌అప్ జోన్లు, సకాలంలో సమాచారం కోసం డిజిటల్ డిస్‌ప్లేలు

  • టికెట్ కౌంటర్ల ఆధునీకరణ, వయోజనులు మరియు వికలాంగులకు సౌకర్యాలు

ఈ పథకం ద్వారా స్టేషన్లు కేవలం రవాణా కేంద్రాలుగా కాకుండా, నగర అభివృద్ధిలో భాగంగా నిలవాలని కేంద్రం ఆకాంక్షిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *