Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున తన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.
అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట, సినీ రంగంలో తనదైన ముద్రవేసిన గొప్ప నటుల్లో ఒకరు. ఆయన యాక్టింగ్‌లో ఉన్న ప్రత్యేకత, హావ-భావాలతో పాత్రను బతికించేవారు. మంచి విలన్‌గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో వేర్వేరు కోణాల్లో మెప్పించారు. సినీ జీవితంలో 750కి పైగా సినిమాల్లో నటించారు.
కోట శ్రీనివాసరావు మృతి వార్త వినగానే సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్ కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్#KotaSrinivasRao #Pawanakalyan #RIPKotaSrinivasaRao #Trivikram pic.twitter.com/oKS7JMZ7PZ
— s5news (@s5newsoffical) July 13, 2025