Maha Kumbhamela 2025

Maha Kumbhamela 2025: రైలులో ఎక్కడానికి చోటు లేకపోతే.. వీళ్ళు చేసిన పనికి టెన్షన్.. మరీ ఇంత దారుణమా

Maha Kumbhamela 2025: మహా కుంభమేళా కోట్లాది ప్రజల తాకిడితో ఉత్సాహంగా సాగుతోంది. కష్టాలు.. ఇబ్బందులు.. ఆకలి.. దప్పిక.. అన్నిటినీ పక్కన పెట్టి ఒక్క పవిత్ర స్నానం చేయాలని దేశ విదేశాల నుంచి భక్త జనం తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్.. రైళ్లలో టికెట్స్ దొరక్క స్టేషన్ల వద్ద వేలాదిమంది పడిగాపులు పడుతున్న దృశ్యాలు.. భక్తుల తాకిడితో సంగం స్టేషన్ ను మూసివేసిన పరిస్థితి. అయినా.. కుంభమేళాలో స్నానం చేయాలని ప్రజలు వస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా.. ఇప్పటికే రికార్డ్ సృష్టించిన కుంభమేళా పూర్తి అయ్యే సమయానికి దాదాపుగా 60 కోట్ల మంది వస్తారని తాజాగా అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కుంభమేళాకు వెళ్లడానికి రైలులో స్థలం లేకపోవడంతో కోపంతో ఉన్న ప్రయాణికులు రైలులోని ఏసీ కోచ్‌లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించి షాక్ ఇస్తున్నాయి. ఫిబ్రవరి 26న మహా కుంభమేళా ముగియనున్నందున, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ప్రతిరోజు కోట్లాది మంది కుంభమేళాకు ప్రయాణిస్తుండటంతో, రవాణా కొరత ఏర్పడింది. ఈ కారణంగా, భక్తులు తమ ప్రయాణంలో అవాంతరాలను సహించలేకపోయారు. ఎలాగైనా కుంభ మేళాకు చేరుకోవాలని ఒకవైపు.. ఎలాగైనా తిరిగి ఇంటికి చేరుకోవాలనే భక్తులు మరోవైపు రెండువైపులా రైళ్లలో రద్దీ మామూలుగా లేదు.
మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి..

ఇది కూడా చదవండి: Valentine’s Day: ప్రేమికుల రోజున మీ ఇష్టమైన వారికి ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి.. ప్రమాదం!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళా కార్యక్రమం జరుగుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. 2013 నుండి ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళా కార్యక్రమం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ 45 రోజుల కార్యక్రమం ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి నటులు మరియు రాజకీయ నాయకుల వరకు చాలా మంది మహా కుంభమేళాలో స్నానమాచరిస్తున్నారు.

రైలులోని ఏసీ కోచ్‌ను ప్రయాణికులు ధ్వంసం చేశారు.

మహా కుంభమేళా ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రతిరోజూ కోట్లాది మంది అక్కడికి తరలివస్తున్నారు. ఈ పరిస్థితిలో, మహా కుంభమేళాకు వెళ్తున్న రైలులో స్థలం లేకపోవడంతో కోపంతో ఉన్న ప్రయాణికులు బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఏసీ కోచ్‌ను ధ్వంసం చేశారు. రైలులో స్థలం లేకపోవడంతో వారు కిటికీల ద్వారా ఏసీ కోచ్ ఎక్కి ప్రయాణించారు. ఇలాంటి సంఘటన బీహార్‌లోనే కాదు, మహారాష్ట్రలోనూ జరగడం గమనార్హం.

 

ALSO READ  IPL 2025: రోహిత్ శర్మ ని దూరం పెడుతున్న ముంబై ఇండియన్స్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *