Tamilnadu: మరో అద్భుతం.. పంబన్ బ్రిడ్జి పూర్తి

Tamilnadu: భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని నిర్మించింది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన (పంబన్) పూర్తయింది. నవంబర్ 13,14 తేదీల్లో తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్‌ను, మండపం నుండి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్‌ను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

హైస్పీడ్ ట్రైన్ ట్రైల్ రన్ మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కిలోమీటర్ల వేగంతో 15 నిమిషాలు పట్టిందని మధురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ వెల్లడించారు.

కొత్త పంబన్ రైల్వే వంతెన పునాది నిర్మాణాన్ని పరిశీలించామనీ, లిఫ్టింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించామని చెప్పారు. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు.

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fake Student: 14 రోజులు ఐఐటీ బాంబేలో ఉండి.. 21 ఈమెయిల్ ఐడీలు సృష్టించిన నకిలీ విద్యార్థి అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *