NBK 109 Title Teaser: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.తాను తాజాగా నటిస్తున్న సినిమా ఎన్.బి.కె 109 గురించి ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈసినిమాకి బాబీ డైరెక్టర్ కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ని చెప్పని దర్శక నిర్మాతలు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబందించిన టైటిల్స్ ఎనో వొచ్చాయి. ఇపుడు టైటిల్ తో పట్టు టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. “డాకు మహారాజ్” అనే పేరు ఫిక్స్ చేశారు. గత సినిమాలకి సంగీతం అందించిన థమన్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.