Paidi Rakesh Reddy: రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ దశలో ఆగ్రహంతో సహనం కోల్పోయి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. నిక్ నేమ్‌తోనూ ఆయన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నది. దీనికంతటికీ.. ఆర్మూరులో ఓడిన ఓ నేతను తీసుకొచ్చి కలెక్టర్‌కు పరిచయం చేయడమే రాకేశ్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది.
Paidi Rakesh Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టపగలే తప్పతాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతాడని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం మందు తాగే కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాదని పిస్స ఎంకడు అని ఆరోపించారు.
Paidi Rakesh Reddy: తనను కాదని ఓడిన నేతను తీసుకొచ్చి అధికారులకు పరిచయం చేయడానికి ఎవరు నువ్వు అంటూ కోమటిరెడ్డిని రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. డబ్బు ఎక్కువుంటే, బలుపు ఉంటే నీ దగ్గరే పెట్టుకో, కోమటిరెడ్డి అనే పేరుతోనే నువు బతికిపోయావ్.. అంటూ రుసరుసలాడారు. బోడి ఆయన పెత్తనం ఏంది? అంటూ ప్రశ్నించారు.
Paidi Rakesh Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డీ.. నువు నల్లగొండలో రాజీనామా చేయి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం.. దమ్ముంటే ఎవరు గెలుస్తారో చూద్దాం.. అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రాకేశ్‌రెడ్డి సవాల్ విసిరారు. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడని రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.