ED Cases: ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా నాయకులపై నమోదైన ED కేసుల్లో దోషులుగా తేలిన రేటు చాలా తక్కువగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. గత 10 సంవత్సరాలలో, ED 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసింది, వాటిలో 2 కేసులను మాత్రమే నిరూపించారు. అయితే, ఈ సమయంలో ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించలేదు.
రాజ్యసభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎంపీ ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. 10 సంవత్సరాలలో ఈడీ రాజకీయ నాయకులపై ఎన్ని కేసులు నమోదు చేసిందని ఎంపీ అడిగారు. ప్రతిపక్ష నాయకులపై చర్యలు పెరిగాయా? ఎంతమందిని శిక్షించారు? ఎంతమందిని నిర్దోషులుగా తేల్చారు? అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Farmers: రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వ చర్చలు విఫలం.. పోలీసుల అదుపులో రైతులు
దీనిపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఇక అభియోగాలు రుజువైన రెండు కేసుల్లో, ఒకటి 2016-17లో, మరొకటి 2019-20లో పూర్తయ్యాయి. విశ్వసనీయమైన సమాచారం, సాక్ష్యాల ఆధారంగా మాత్రమే ED దర్యాప్తు నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ED అన్ని చర్యలు ఎప్పుడూ న్యాయ సమీక్షకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.