Numaish Exhibition: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 84వ ఆలిండియా ఎగ్జిబిషన్ నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అంటే 46 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Numaish Exhibition: జనవరి 1న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. నుమాయిష్‌లో 2,000కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దొరికే వస్తువులను ఈ ఎగ్జిబిషన్‌లో అమ్మకానికి ఉంచనున్నారు. డబుల్ డెక్కర్ బస్సులను కూడా ఈ ప్రదర్శనలో ప్రారంభిస్తారు.
Numaish Exhibition: నిత్యం వేలాది మంది పాల్గొనే ఈ నుమాయిష్ ప్రదర్శనలో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫైర్ సేఫ్టీ కోసం అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రారంభానికి ముందుగా ఈ రోజు నుంచే ప్రదర్శనలో అమ్మకానికి ఉంచనున్న వస్తువులను స్టాళ్ల నిర్వాహకులు తరలిస్తున్నారు.