South Korea: దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179కి చేరింది. తొలుత 29 మంది చనిపోయినట్టు నిర్ధారించిన అక్కడి అధికారులు.. ఆ తర్వాత విమానంలో ఓ ఇద్దరు మినహా మిగతా ప్రయాణికులు అందరూ చనిపోయారని నిర్ధారణ అయింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఘోర విమాన ప్రమాద ఘటనగా అభివర్ణించారు.
South Korea: బ్యాంకాక్ నుంచి వస్తున్న బెజు ఎయిర్ విమానం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై కుప్పకూలి, పేలిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వస్తన్న ఈ బెజు విమానం దేశంలోని నైరుతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
South Korea: ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో అదుపుతప్పి గోడను ఢీకొనడంతో విమానం పేలి ఈ ఘటన జరిగిందని సాంకేతిక నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా అందరూ మంటల్లో తీవ్రగాయాలపాలై చనిపోవడం విషాదకరం. ప్రయాణికుల వివరాలు, వారి చిరునామా సేకరణలో, వారికి సమాచారం ఇచ్చే పనిలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు.