White Hair: మొన్నటి వరకు తెల్లజుట్టుతో పెద్దవాళ్ళే కంగారు పడ్డా.. కానీ ఇప్పుడు చిన్నతనంలోనే జుట్టు తెల్లబడుతుంది. దీంతో చిన్న వయసులోనే వారు కూడా పెద్దవారిగా కనిపిస్తున్నారు. ఇంట్లోనే సహజమైన పద్ధతిని ఉపయోగించి పేస్ట్‌ను తయారు చేయడం ద్వారా జుట్టు సమస్యను చాలా సులభంగా వదిలించుకోవచ్చు. వారానికి ఒకసారి ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మీ జుట్టు ఆరోగ్యంగా మరియు పొడవుగా మారుతుంది. కాబట్టి ఆ సలహని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసినవి: బృంగరాజ పొడి – రెండు చెంచాలు, ఉసిరి పొడి – రెండు చెంచాలు, పెరుగు – నాలుగు చెంచాలు.
ఇది కూడా చదవండి: Numaish Exhibition: జనవరి 1 నుంచి నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్
White Hair: హెయిర్ ప్యాక్ ఎలా: ఒక గిన్నెలో మూడు చెంచాల భృంగరాజ పొడిని తీసుకోండి. ఆ తర్వాత రెండు చెంచాల ఉసిరి పొడి, నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి.. పేస్ట్‌లా చేయడానికి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.దాదాపు అన్ని జుట్టు సంబంధిత సమస్యలు మాయమవుతాయి. వీటిలో ప్రతి ఒక్కటి జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. ఈ పేస్ట్‌ని తయారు చేసి వారానికి ఒకసారి వాడడం వల్ల మీ జుట్టు నల్లగా, పొడవుగా మరియు మెరుస్తూ ఉంటుంది.