Raghunandan rao: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారారు. బీఆర్‌ఎస్ పార్టీపై ఆయన చేసిన ఘాటు విమర్శలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి.
” బీఆర్ఎస్ ఇప్పుడు ఓ చచ్చిన పాము లాంటిదని” వ్యాఖ్యానించిన రఘునందన్ రావు, ఈ పార్టీ బీసీలపై దోబూచులాడుతోందని విమర్శించారు. “బీసీల కోసం నిజమైన చిత్తశుద్ధి ఉంటే, పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని నియమించాలి” అని డిమాండ్ చేశారు.
కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఎత్తిచూపిన రఘునందన్ రావు, “ఆమె తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. బీసీ కులగణనపై ఇప్పుడు మాట్లాడుతున్న కవితకు ఈ బాధితుల గురించి ముందుగా ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలి” అని ప్రశ్నించారు.
“కేటీఆర్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. న్యాయవ్యవస్థకు ఎవరు పెద్దలు కావాలని నేర్పుతారు? ఎవరు తప్పు చేసినా, పోలీసులు కేసులు పెడతారు. మీపై కేసులకు మోదీకి ఏ సంబంధం?” అని ప్రశ్నించారు.
“మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీశ్ రావు, కవిత అక్కర్లేదు. ముందు కేసీఆర్‌ను తీసుకుపోయేవాళ్లం. మా దగ్గర చిత్తశుద్ధి ఉంది” అని తెలిపారు.