Naresh: మహేశ్ తో నా అనుబంధం..

Naresh: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మనందరం ఒక్కటే. ప్రేమాభిమానాలతో ఉండాలని మా పెద్దలు మాకు నేర్పించారు. ఈ విలువలను ఇప్పటికీ మా జీవితంలో పాటిస్తున్నాం,” అని నరేశ్ తెలిపారు.

“ఎవరి ఆస్తిపాస్తులు వాళ్లవే, ఎరి వృత్తి వాళ్లదే. అంతకంటే ముఖ్యంగా మా మధ్య మంచి అనుబంధం ఉంది. తగాదాలు వచ్చే పరిస్థితులు లేవు, అలాగే తగాదాలు రాకూడదనే కోరుకుంటాం. ఎవరి జీవితాలను వాళ్లు ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడెప్పుడు కలిసినా ఆనందంగా కలుస్తాం, హాయిగా మాట్లాడుకుంటాం, తృప్తిగా భోజనం చేస్తాం. ఈ జీవితానికి అది సరిపోతుంది,” అన్నారు.

మా పెద్దలు మాకు నేర్పించిన సంస్కారాలు ఇవేనని, సెట్‌పై ఉన్నా, బయట ఉన్నా తమ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని నరేశ్ స్పష్టంచేశారు. “మనసులో ద్వేషం, ఈర్ష్య, ఆస్తి గొడవలు ఉంటే తగాదాలు వస్తాయి. కానీ మా మధ్య అలాంటివి ఏమీ లేవు. అందరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. ఈ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉండాలని నా కోరిక, వాళ్ల కోరిక,” అని నరేశ్ వివరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *