Nandamuri Varasulu

Nandamuri Varasulu: రంగం సిద్ధం.. లైట్స్ ఆన్.. యాక్షన్ స్టార్ట్!

Nandamuri Varasulu: వెండి తెరపైనే కాదు, పొలిటికల్‌ తెరపైనా నందమూరి హీరోలు మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఈ ఇద్దరు నందమూరి హీరోలు.. నారా లోకేష్‌తో కలిసి తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారా? గతంలో విభేదాలు, గొడవలు అంటూ.. వైసీపీ ట్యూన్‌లో జర్నీ సాగినా.. ఇప్పుడు ఈ నందమూరి వారసులు ఒక్కటై, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహం ఇస్తున్నారు.

ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మాటలు లేవని, నందమూరి ఫ్యామిలీలో జూనియర్‌ ఒంటరి అయిపోయారనీ, ఆ సమయంలో కళ్యాణ్ రామ్ తన సోదరుడికి అండగా నిలిచాడని పుకార్లు షికార్లు చేశాయి. హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఏదో గ్యాప్ వచ్చిందని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకే కాకుండా, తెలుగుదేశం కుటుంబానికీ దూరమయ్యాడని, వైసీపీ బ్యాచ్ గట్టిగా ప్రచారం చేసింది. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. బాలకృష్ణకు పద్మ అవార్డు రాగానే జూనియర్ ఎన్టీఆర్ “బాలా బాబాయ్” అంటూ ట్వీట్ చేసి అభినందనలు తెలిపాడు.

కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్‌కి గ్రాండ్ సెల్యూట్ చేసి, విభేదాలన్నీ సునాయాసంగా క్లియర్ చేశాడు. ఇక నారా లోకేష్ ఎంట్రీతో స్టోరీ మరింత హైవోల్టేజ్‌ని అందుకుంది. గన్నవరం నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్‌కు టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని అందించారు. లోకేష్ ఆ ఫ్లెక్సీని పట్టుకుని సందడి చేశారు. అలా మేమంతా టీడీపీ కుటుంబమే… అంటూ లోకేష్ గట్టిగా హింట్‌ ఇచ్చారు. దాంతో “లోకేష్‌ అన్న.. నువ్వు సూపర్‌ అన్న” అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు.

Nandamuri Varasulu: గతంలో 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం రాష్ట్రమంతా తిరిగారు. ప్రమాదం జరిగినా, ఆస్పత్రి నుండే… సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని వీడియో రిలీజ్ చేసి.. తన లాయల్టీని చాటుకున్నారు. ఈ విషయాన్ని లోకేష్ పలు సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే గుర్తు చేసుకున్నారు కూడా. ఇక కళ్యాణ్ రామ్ రీసెంట్ స్టెప్ అయితే ఫుల్ మాస్ అంటున్నారు ఫ్యాన్స్‌! తన సినిమా ప్రమోషన్ కోసం నరసరావుపేట వచ్చిన కళ్యాణ్ రామ్, టీడీపీ జెండాను ఎగరేసి స్టేజ్‌ని షేక్ చేశారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఫోటోలతో ఉన్న ఆ జెండాను పట్టుకుని “మనమంతా ఒక్కటే” అన్న సంకేతం ఇచ్చారు కళ్యాణ్‌ రామ్‌. అక్కడికొచ్చిన ఫ్యాన్స్ “బాలయ్య బాబు మాస్‌.. కళ్యాణ్ అన్న రాక్స్‌” అంటూ గోల గోల చేశారు. ఆ తర్వాత దర్శి టీడీపీ ఇంచార్జ్ డా.గొట్టిపాటి లక్ష్మి ఇంటికి వెళ్లి, అక్కడే బస చేసి… టీడీపీతో తన కనెక్షన్… ఫుల్ స్ట్రాంగ్‌ అని చెప్పకనే చెప్పారు కళ్యాణ్‌ రామ్‌.

ALSO READ  VSR Social Media Damal: ఫ్యాన్స్‌ లేరు, ఫాలోవర్లు లేరు, మునుపటి ఊపూ లేదు..!!

Also Read: CM chandrababu: 150 కోట్లతో అమరావతి టీటీడీ దేవాలయ నిర్మాణం..

Nandamuri Varasulu: గతంలో వైసీపీ…. తారక్ జగన్‌తో ఇంటర్నల్‌ డీల్ కుదుర్చుకున్నారంటూ, అందుకే టీడీపీకి దూరమయ్యాడంటూ.. అనేక గాసిప్స్‌ని క్రియేట్‌ చేసి వదిలింది. కానీ, జూనియర్ ఆ రూమర్స్‌ను గట్టిగా తిప్పికొట్టారు. “నా తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నాకు రక్తంలో ఉంది.. నేను ఎప్పటికీ ఈ జెండా మోస్తా” అంటూ క్లారిటీ ఇచ్చారు ఒకానొక సందర్భంలో. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా పసుపు జెండా ఎగరేసి వైసీపీ నోటికి తాళం వేశాడు. నందమూరి-నారా కుటుంబాలు దగ్గరవుతున్న ఈ సన్నివేశాలు చూసి.. ఫ్యాన్స్ డాన్స్‌లు వేస్తుంటే, టీడీపీ కార్యకర్తలు “ఇదే మన బలం” అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ పాజిటివ్ వైబ్‌తో నందమూరి హీరోలు సినిమా స్క్రీన్‌పైనే కాదు, రానున్న రోజుల్లో పొలిటికల్ స్టేజ్‌పై కనిపించినా ఆశ్చర్యం లేదు. లోకేష్ లీడర్‌షిప్‌లో సైకిల్‌ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తుంటే.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్యలు ఆ జోష్‌ను డబుల్ చేస్తున్నారు. ఇదీ నందమూరి వారసుల స్టైల్.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్, కార్యకర్తలకు బూస్ట్ అంటూ సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో పండగ చేసుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *