Naga Chaitanya

Naga Chaitanya: శోభితతో వెకేషన్ మోడ్ లో నాగచైతన్య.. ఫొటోలు వైరల్!

Naga Chaitanya: సమంతతో విడిపోయిన నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు. గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్థూడియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్ళికి ముందు రెండేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

పెళ్లి తర్వాత ‘తండేల్’ తో హిట్ కొట్టాడు చైతూ. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ భార్యతో వెకేషన్స్ తిరుగుతున్నారు.ఇటీవలే ఆమ్‌స్టర్‌డామ్ , మెక్సికో వీధుల్లో చిల్ అవుతూ కనిపించిన ఈ జంట..తాజాగా రేసింగ్ ట్రాక్ పై సందడి చేసింది. నాగ చైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో రేస్ కూడా చేస్తుంటాడు.

Also Read: Pradeep: హోలీ నాడు అమ్మాయితో ప్రదీప్.. వైరల్?

ఈ క్రమంలోనే శోభితను కూడా అక్కడకు తీసుకెళ్లి కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. శోభిత రేసింగ్ కారులో కూర్చొని ఫొటోలు దిగుతూ కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maharashtra -Jharkhand Election Results: మహారాష్ట్ర - జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు లైవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *