Coffee: కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తాజా అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ తాగొద్దు అంటున్నారు నిపుణులు. ఐతే ఎప్పుడు తాగాలి..? రండి చూద్దాం..
ఉదయాన్నే కాఫీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. రోజు మొత్తం కాఫీ తాగే వారికి ఈ రిస్క్ తక్కువ. అమెరికాలోని తులాన్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం, ఉదయాన్నే కాఫీ తాగేవారిలో 16 శాతం తక్కువ మరణాలు, గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 31 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం కాఫీ తాగేవారి మరణాల రేటు మధ్యాహ్నం కాఫీ తాగేవారి కంటే తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
పరిశోధకులు 1999 మరియు 2018 మధ్య సుమారు 40,725 మందిని అధ్యయనం చేశారు. పాల్గొనేవారు కనీసం పగటిపూట కాఫీ తీసుకున్నారు. ఈ అధ్యయనం వారు కాఫీని ఎప్పుడు ఎంత మోతాదులో వినియోగించారు అనే సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ సారి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం కాఫీ తాగాలనుకునే వారు మానుకోవాలని డాక్టర్లు అంటున్నారు.
ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం పూట కాఫీ తాగాలి అని అనుకుంటే దానికి దూరంగా ఉండటం మంచిది. కాఫీ దీర్ఘాయువుకు దోహదపడుతుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితమైన కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.