Naga Chaitanya: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో గురువారం ఉదయం వీఐపీ దర్శన విరామ సమయంలో టాలీవుడ్ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య శోభిత ధూలిపాళ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇక సినిమాటిక్ ఫ్రంట్‌లో నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం NC-24 టైటిల్‌తో ఒక కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సమంతతో విడాకుల తర్వాత శోభితతో రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, గతేడాది అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వివాహ వేడుక జరుపుకున్నారు. ఆ తర్వాత శోభిత పూర్తిగా సినిమాలకు దూరంగా, సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించకపోవడం గమనార్హం.
ఇక తాజా దర్శనంతో వీరిద్దరూ మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చారు. నాగచైతన్య పట్టు పంచెలో, శోభిత ఎరుపు చీరలో సాంప్రదాయ వేషధారణలో దర్శనమిచ్చారు. ఈ జంటను చూసిన భక్తులు, నెటిజన్లు ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ దర్శనం వెనుక ప్రత్యేక కారణం ఉందా? అనే చర్చ కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది అభిమానులు “ఏదైనా గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నారా?”, “శోభిత తల్లి కాబోతుందా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఏదీ వెలువడలేదు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగచైతన్య దంపతులు#NagaChaitanya #SobhitaDhulipala #tirumala pic.twitter.com/yHDkhixR3M
— s5news (@s5newsoffical) August 21, 2025