Monalisa: కుంభమేళ మోనాలిసాకు భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే షాక్

Monalisa: ´ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 16 ఏళ్ల మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూసలు అమ్ముకునే ఈ తేనెకళ్ల సుందరి రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె డస్కీ బ్రౌన్ రంగులో మెరిసే అందానికి ఆకర్షితులైన వారు ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమె తాలూకు చిత్రాలు, క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ పాపులారిటీ ఆమె జీవితం మారేలా చేసింది. తాజాగా, బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రం “ది డైరీ ఆఫ్ మణిపూర్” కోసం మోనాలిసాకు అవకాశమిచ్చారు. ఇప్పటికే ఆమె ఈ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఇక, ఆమె తొలిచిత్రానికి భారీ పారితోషికం అందుకున్నట్లు ప్రచారం సాగుతోంది. రూ. 21 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్లు సమాచారం. అంతేకాక, స్థానికంగా బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ. 15 లక్షల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒక్కరోజు పూసలు అమ్ముకొని రూ. 1000 సంపాదించుకునే మోనాలిసా ఇప్పుడు లక్షల్లో ఆర్జిస్తుండటం నిజంగా అద్భుతమే. కుంభమేళాలో సాధారణ అమ్మాయిగా ఉన్న ఆమె బాలీవుడ్‌ హీరోయిన్‌గా మారిన ఈ ప్రయాణం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. “అదృష్టం అంటే ఇదే!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  FCI GRS App: పంజాబ్ లో వరి రైతుల కోసం ప్రత్యేక యాప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *