FCI GRS App: పంజాబ్‌లో వరి, కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రైస్ మిల్లర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి పోర్టల్‌ను ప్రారంభించింది.అంతకు ముందు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రాష్ట్రంలో వరి సేకరణలో జాప్యం చేస్తోందని రైతులు, మిల్లర్లు ఆరోపించారు. దీంతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి రైస్ మిల్లర్ల కోసం మొబైల్ అప్లికేషన్ FCI గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ లో చిన్నారుల “మమ్మీ పాపా వోట్ డు” దేశవ్యాప్త ట్రెండింగ్
FCI GRS App: పారదర్శకత, జవాబుదారీతనం, వాటాదారుల సంతృప్తిని పెంపొందించేందుకు ఇది ఒక అడుగు అని కేంద్రం పేర్కొంది. “మొబైల్ అప్లికేషన్ రైస్ మిల్లర్లు తమ ఫిర్యాదులను ఎఫ్‌సిఐతో సమర్ధవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో దోహదపడుతుంది. సుపరిపాలన కోసం సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే FCI GRS అప్లికేషన్” అని కేంద్రం తెలిపింది.ఈ యాప్ రైస్ మిల్లర్లకు ఫిర్యాదులు చేయడానికి, వారి స్థితిని పర్యవేక్షించడానికి, వారి మొబైల్‌లలో వాటి వివరాలను తెలుసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. దీనిలో కంప్లైంట్ రిజిస్టర్ కాగానే తదుపరి చర్య కోసం అది ఆటోమేటిక్ గా FCIలో సంబంధిత అధికారులకు చేరిపోతుంది.