mohan lal

Mohan Lal: ‘అమ్మ’ వద్దంటున్న మోహన్ లాల్!?

Mohan Lal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇకపై ‘అమ్మ’కు అధ్యక్షుడిగా ఉండనని చెప్పేశారు. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మలయాళ చిత్రపరిశ్రమలో గందరగోళం ఏర్పడింది. జస్టిస్ హేమ కమిటీ తమ రిపోర్ట్ ను బహిర్గతం చేసిన తర్వాత ‘అమ్మ’ అధ్యక్షుడుగా మోహన్ లాల్, ఇతర కమిటీ సభ్యులు రాజీనామా చేసేశారు. పలువురు నటులు పవర్ గ్రూప్ గా మారి అంతర్గత విషయాలను బయటకు రానివ్వటం లేదని కొంత మంది నటీమణులు ఆరోపణలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ వద్ద సరైన వసతులు కూడా ఉండవని రాధిక బహిరంగంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి గందరగోళ సమయంలో AMMA ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో మోహన్ లాల్ తాను అధ్యక్షుడుగా ఉండబోననని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:

Mohan Lal: ఆధారాలు ఉంటే తప్పు చేసిన వారిని తప్పక శిక్షించవలసిందేనని మోహన్ చెబుతున్నారు. ‘పవర్ గ్రూప్’ అంటూ ఏదీ లేదని, మలయాళ చిత్ర పరిశ్రమకు ఇది గడ్డుకాలమని, దీని భవిష్యత్ సమస్యల్లో పడిందంటున్నారు మోహన్ లాల్. అయితే పాత ఎగ్జిక్యూటివ్ కమిటీనే పునరుద్ధించాలని నటుడు సురేశ్ గోపి, మాజీఉపాధ్యక్షుడు జయన్ ఇది వరకే సూచించారు. అయితే ఇప్పుడు మోహన్ లాల్ తను ఉండబోనని చెప్పటంతో అమ్మను సమర్ధవంతంగా నడపగలిగే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు నటీనటలు. మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ‘ఎల్ 2: ఎంపురాన్’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Borugadda Anil: బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *