ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు సౌకర్యంగా పాల్గొనాలంటే ముందస్తు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు. కార్పొరేషన్ ఇప్పటికే 1.5 లక్షల చేప పిల్లలను ప్రసాద తయారీ కోసం సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి: MP Shashi Tharoor: కాంగ్రెస్‌కు థరూర్ గుడ్‌బై?.. బీజేపీలో చేరనున్నారా?.. ఎంపీ సమాధానం ఇదే
మంత్రి స్వయంగా బారికేడింగ్, క్యూ లైన్లు, భద్రతా చర్యలు వంటి అంశాలను సమీక్షించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రజల రద్దీకి అనుగుణంగా భద్రతను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు తాగునీరు, భోజన వసతి వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి స్వచ్ఛంద సంస్థల సహాయంతో వచ్చే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను అధికారులపై పెట్టారు.
జూన్ 6వ తేదీ నుంచే ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావొచ్చన్న అంచనాతో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరంగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, వాహన పార్కింగ్, దిశానిర్దేశక బోర్డులు వంటి అంశాల్లో మరింత శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో సాగేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.