Narendra Modi: విధ రంగాల్లో కరీబియన్ దేశాలతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగిన ‘జి-20’ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ నిన్న రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మరో దక్షిణ అమెరికా దేశమైన గయానా చేరుకున్నారు. భారత ప్రధాని గయానాలో పర్యటించడం 56 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1968లో ఇందిరాగాంధీ ఇక్కడ పర్యటించారు.
రాజధాని జార్జ్‌టౌన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అక్కడ ఆయనకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఆంథోనీ ఫిలిప్స్ స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ లో డబుల్ ఇంజన్ సర్కార్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
Narendra Modi: దీని తర్వాత, భారతదేశం మరియు గయానా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనంగా, జార్జ్ టౌన్ మేయర్ బార్నీ జెంకిన్స్ ప్రధానమంత్రి మోడీకి నగర తాళం చెవిని అందజేశారు.
అనంతరం హోటల్‌కు వెళ్లిన ప్రధాని మోదీకి గ్రెనడా ప్రధాని డికెన్ మిచెల్, బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ స్వాగతం పలికారు. అలాగే ప్రవాస భారతీయులు కూడా హోటల్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ, గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రధాని మోదీని గయానాలో అత్యున్నత జాతీయ అవార్డు ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’తో సత్కరించనున్నారు. బార్బడోస్ కూడా ఆయనను అత్యున్నత గౌరవంతో సత్కరిస్తుంది.