Siddharth: హీరో సిద్ధార్థ్ ఏ మాత్రం మారలేదు. ఆ మధ్య ‘మిస్ యు’ సినిమా ప్రమోషన్స్ కు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అదే అహంకారాన్ని చూపించాడు. తనలోని నటుడిని ‘చిన్నా’ మూవీ తర్వాత గుర్తించి నిర్మాతలు వస్తున్నారని అన్నాడు. పదేళ్ళ పాటు లవ్ స్టోరీ చేయకూడదనే తాను నిర్ణయం తీసుకున్నానని, కానీ ‘మిస్ యు’ కథ నచ్చి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టానని చెప్పాడు. తానేప్పుడో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందానని తెలిపాడు. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా డిసెంబర్ 5న వస్తున్నా… తనకేం భయం లేదని, తన సినిమాను చూసి వాళ్ళే భయపడాలి అన్నట్టుగానూ మాట్లాడాడు. చెన్నయ్ లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా ‘మిస్ యు’ను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాతలు మొన్న నిర్మాతలు ప్రకటించారు. దాంతో… ఇప్పుడు అల్లు ఆర్మీ సిద్ధార్థ్ ను ట్రోల్ చేయడం మొదలెట్టింది. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాంటి సిట్యుయేషన్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆట పట్టిస్తోంది.

