AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం నడిబొడ్డున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయం బయటపడింది. గుట్టుచప్పుడుకాకుండా గత కొన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్టు తేటతెల్లమైంది. స్పాసెంటర్ ముసుగులో ఈ కార్యకలాపాలు జరుగుతున్న విషయాన్ని పోలీసులు తేల్చారు. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
AP News: పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒంగోలు నగరంలోని పార్వతమ్మ గుడి సమీపంలోని ఓ స్పా సెంటర్‌లో ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పక్కా సమాచారంతో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు, కండోమ్ ప్యాకెట్లు లభ్యమవడంతో పోలీసులు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఎంతకాలం నుంచి జరుగుతన్నాయి, ఎవరెవరు బాధ్యులు, బాధితులు ఎవరు? అన్న కోణాల్లో పోలీసులు రాబడుతున్నారు.