Mirai Twitter Review

Mirai Twitter Review: మిరాయ్ ట్విట్టర్ టాక్.. తేజ సజ్జాకు మరో బ్లాక్ బస్టర్?

Mirai Twitter Review: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న తేజ సజ్జా, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొల్పారు. ఆ అంచనాలను మించి ఈ సోసియో ఫాంటసీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

సినిమా చూసిన ప్రేక్షకులు ముఖ్యంగా దాని సాంకేతిక అంశాలను ప్రశంసిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX), విజువల్స్ తో ఒక దృశ్య కావ్యంలా ఉందని అంటున్నారు. రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమాలతో పోలిస్తే, ‘మిరాయ్’ మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు.

నటీనటుల ప్రదర్శన, ప్రభాస్ వాయిస్ ఓవర్ హైలైట్స్
సినిమాలో తేజ సజ్జా, మంచు మనోజ్ ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయని చెబుతున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో అదరగొట్టారని, అలాగే జయరాం, జగపతిబాబు, రితిక నాయక్, శ్రియ శరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రేక్షకులు ప్రశంసించారు. అయితే, సినిమాకి అత్యంత పెద్ద సర్ప్రైజ్ ప్రభాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అని, ఆ వాయిస్‌తో థియేటర్లలో ఒకటే సందడి నెలకొందని అభిమానులు అంటున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే రాముడి ఎంట్రీ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.

మిరాయ్ ఒక మంచి కథ, అద్భుతమైన సాంకేతికత, ప్రేక్షకుల అంచనాలకు మించిన వీఎఫ్ఎక్స్ తో ఒక గొప్ప చిత్రంగా నిలిచిందని అంటున్నారు. ఇది కుటుంబంతో కలిసి థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని, ‘మిరాయ్’ తో తెలుగు సినిమా సత్తాను మరోసారి దేశానికి చూపించారని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జాకు మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ  Ram Charan-Sujith: సంచలనం.. రామ్ చరణ్-సుజిత్ కాంబోలో మాస్ మూవీ?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *