Nara Lokesh

Nara Lokesh: మా పవనన్న సినిమా వస్తుంది: నారా లోకేష్

Nara Lokesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రేపు విడుదల కానున్న సందర్భంగా, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 1 “పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం” అని లోకేష్ పేర్కొన్నారు. సినిమా అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్-లోకేష్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ఈ ట్వీట్ నిదర్శనంగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు, ఇతరత్రా మద్దతు అందిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ‘హరిహర వీరమల్లు’ విజయంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  etala rajendar: కేటీఆర్‌కు ఈటల ఓపెన్ ఛాలెంజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *