Fennel Seeds: సోంపును చాలా మంది వంటల్లో ఉపయోగిస్తారు. కొంతమందికి తిన్న తర్వాత సోంపు కంపల్సరీ ఉండాల్సిందే. అయితే వాటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల భోజనం తర్వాత సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పడుకునే ముందు సోంపు తినడం మంచిదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సోంపులో కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సోంపులో ఫైబర్, పొటాషియం, అనేక పోషకాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
సోంపు తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు తరచుగా తినవలసిన అవసరం ఉండదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ భోజనం తర్వాత సోంపును నమలాలి. నొప్పి, ఋతు చక్రం సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి.. రాత్రి భోజనం తర్వాత కొంచెం నీటిని తాగి సోంపు తీసుకోవాలి. ఈ విధంగా రాత్రిపూట సోంపు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.