Nadendla Manohar: ఏలూరు జిల్లా ఇంచార్జీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో పర్యటించారు. ఏలూరు చేరుకున్న మంత్రి నాదెండ్లకు జనసేన నాయకులు రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఏలూరు కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రి సెల్వీ, ఎస్పీ కొమ్మి ప్రతాప్ సహా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “అన్ని వనరులు కలిగిన ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం , అధికారులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. వరదల వల్ల ఇటీవల ఏలూరు జిల్లాకు జరిగిన నష్టం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ పటిష్టంగా వ్యవహరించేల చర్యలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోలవరం పనులు ముందుకు సాగేలా చర్యలు చేపడతామని, వచ్చే 3సంవత్సరాల్లో పోలవరం పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక సిద్దం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.