Viral Dance: ప్రస్తుతం ప్రతి ఒక్కరు టైం దొరికిన వెంటనే రీల్స్ చేస్తూ ఉండడం చుస్తునాం. ఇప్పుడు అలాగే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడడంతో ఇద్దరు బైకర్లు రోడ్డుపైకి వచ్చి పుష్ప-2 సినిమాలోని పీలింగ్స్ పాటకు జోరుగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలే విడుదలైన పుష్ప-2 సినిమా ఎన్నో రికార్డులను బాధలు కొట్టి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పాటలు కూడా అందరికి నచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పీలింగ్స్ పాటకు యూత్ పూర్తిగా ఫిదా అయిపోయారు అని చెప్పుకోవొచ్చు. పాట మధ్యలో వచ్చే మలయాళం లిరిక్స్ కి రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అలానే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో కాస్త డిఫరెంట్ గా చేద్దాం అంటూ బైక్ దిగిన ఈ ఇద్దరు బైకర్ల డాన్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Squirrels Hunting Voles: వామ్మో కలికాలం.. ఉడుతలు ఎలకల్ని తినేస్తున్నాయి!
Viral Dance: ఇద్దరు బైకర్లు రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపి, రోడ్డుపైకి వచ్చి పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ పాటకు జోరుగా డ్యాన్స్ చేశారు. అదే సిగ్నల్ దగ్గర ఉన్న ఇతర వాహనదారులు వలని చూస్తూ ఉన్నారు. అంత మందిలో కూడా ఏమాత్రం సిగ్గు పడకుండా డాన్స్ చేసిన వీడియో ను X ఖాతాలో షేర్ చేశారు.
నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 11 మిలియన్ వ్యూస్ ఇంకా అనేక కామెంట్స్ వచ్చాయి. అందులో ఒక్కరు చాలా అద్భుతం అని అన్నారు.
వీడియో ఇక్కడ చూడవొచ్చు..
View this post on Instagram