Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జగయ్యపేట మండలంలోని తొర్రగుంటపాలె వద్ద ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజీలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి మొత్తం గిడ్డంగిని కప్పేయడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే, ఇప్పటికే గోదాంలో నిల్వ ఉన్న భారీ స్థాయిలో మిర్చి తగలబడిపోయినట్లు సమాచారం.
రూ.12 కోట్లకు పైగా నష్టం
ప్రారంభిక సమాచారం ప్రకారం, గోదాములో సుమారు 40,000 మిర్చి బస్తాలు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. మంటల వల్ల మొత్తం నిల్వ దగ్ధమైపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల దాదాపు రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి దినఫలాలు
ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఈ అగ్ని ప్రమాదం ప్రభావం చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై కూడా పడింది. మిర్చి పొగ వల్ల విపరీతమైన దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ, మిర్చి ఘాటుతో ప్రజలు తుమ్ములు, దగ్గుతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.