Mallikarjun Kharge: అమెరికాలో అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఆయన తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించి ఉండాల్సిందని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడవద్దని మోడీ ట్రంప్‌ను కోరాల్సిందని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నిన్న రాజ్యసభలో ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: Accident: అదుపు తప్పి కాలువలో పడిన కారు.. ఆర్మీ జవాన్ సహా ఇద్దరు మృతి.. .
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు; బదులుగా, భారతదేశం తరపున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. తన పర్యటన సందర్భంగా జైశంకర్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ, ఖర్గే “మోదీకి మొదట ఆహ్వానం అందలేదు. ఈ యాత్ర విజయవంతమవుతుందా? ” అంటూ ప్రశ్నించారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను బహిష్కరించే విషయం గురించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, “ప్రధాని మోడీ దీని గురించి ట్రంప్‌తో మాట్లాడి ఉండాల్సింది. భారతీయులను సైనిక విమానంలో పంపడం సరైనది కాదు. వారిని పౌర విమానంలో ఎందుకు పంపకూడదని మోదీ అడిగి ఉండాలి. మోదీకి ట్రంప్ తో ఉన్న సన్నిహిత స్నేహం తప్పు అని నేను అనుకుంటున్నాను.
ప్రధాని మోదీ ట్రంప్ తో మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది దేశానికి మేలు చేస్తుందని ఆయన అంటున్నారు. కానీ ఇది నమ్మదగ్గ విషయం కాదు అంటూ ఖర్గే నిప్పులు చెరిగారు. మోదీ -ట్రంప్ నిజంగా సన్నిహితులు అని అనిపించడం లేదు. వారే కనుక సన్నిహితులైతే, భారతీయ వలస కార్మికులను ఇలా బహిష్కరించవద్దని మోదీ ఫోన్‌లో కోరేవాడు” అనిఖర్గే అన్నారు.
రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వారి వ్యక్తిగత స్నేహం కంటే చాలా ముఖ్యమైనవని మల్లికా జూన్ ఖర్గే అన్నారు. “మోదీ నమ్మకంగా మాట్లాడతారు. కానీ ఆయనకు అబద్ధం చెప్పే అలవాటు కూడా ఉంది. “కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇవ్వదు” అని చెప్పుకొచ్చారు.