ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్ టాటా అంతిమ సంస్కారాలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. మధ్యాహ్నం మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించి.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది.
అలాగే రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశాడని.. ఆయన అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న ప్రదానం చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.