Mahaa Vamsi: ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. మయన్మార్ . . థాయ్ లాండ్ లలో భారీ భూ ప్రకంపనలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. బ్యాంకాక్ లో పరిస్థితి దయానీయంగా మారిపోయింది . ఎత్తైన భవనాలు కుప్పకూలిన దృశ్యాలు . . రోడ్లు చీలిపోయిన ఫోటోలు . . భయంతో పరుగులు తీస్తున్న ప్రజల వీడియోలు అక్కడి భీతావహ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన పరిస్థితుల్లో ప్రక్రుతి వైపరీత్యాలను అడ్డుకోవడం లేదా దాని ప్రభావాన్ని తగ్గించడం చేయలేక పోయినా.. జరిగిన విధ్వంసం సెకన్లలో ప్రపంచం ముందుకు వస్తోంది. ప్రకృతిని రక్షించాలని మేధావులు ఎంత చెప్పినా . . చెవికెక్కించుకొని విధానాల దుష్ఫలితాలు ఇవి. బ్యాంకాక్ లో ఒక్కసారిగా వచ్చిన భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు చిగురుటాకుల్లా ఊగిపోయాయి. చాలా చోట్ల పెద్ద భవంతులు కుప్పకూలిపోయాయి . బీభత్సం ఎంతలా ఉందంటే అసలు ఎంత ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందో తేలడానికి కనీసం వారం రోజులు పెట్టొచ్చని చెబుతున్నారు .
ఇటీవల కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయి . ఈ బ్యాంకాక్ భూకంప దృశ్యాలు చూస్తుంటే ఒకప్పుడు మన దేశాన్ని కుదిపేసిన లాతూర్ భూకంపం గుర్తుకు వచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు . ఇదే స్థాయిలో మన దేశంలో భూకంపం సంభవిస్తే పరిస్థితి ఏమిటని అందరూ భయపడుతున్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. ఈ విషయాన్నీ గమనించుకుని జాగ్రత్త పడకపోతే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది నిజం .
బ్యాంకాంగ్ లో బీకర భూకంపం..భారత్ లో ప్రకంపనలు.. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు :