Mahaa Vamsi

Mahaa Vamsi: పోసాని కొసం స్పెషల్ ఫుడ్.. జైల్లో పప్పు సాంబార్

నోరు ఉంది కదా అని పారేసుకుంటే . . ఎప్పటికైనా తిప్పలు తప్పవు .  అది సమాజంలో కచ్చితంగా జరిగే పని .  దానికి డబ్బు . . హోదా . . ఇలాంటివి ఏమీ పనికిరావు .  వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ నోరు అదుపు తప్పి ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక్క మాట మాట్లాడితే, దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే .  రాజకీయాల్లో గత అదియెల్లలో ఏపీలో జరిగిన నోరుపారేసుకునే విధానం ప్రజలందరూ చూశారు. అప్పటి ప్రతిపక్ష నేతలపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులపై విచ్చల విడిగా అప్పట్లో నేతలు నోటికి వచ్చినట్టు . . అడ్డూ అదుపూ లేకుండా పేలాపనలు పేలారు .  ఇప్పుడు సీన్ మారింది .  అప్పుడు చేసిన ఆ తప్పిదానికి ఇప్పుడు వరుసగా ఒక్కొరుగా కేసుల్లో  ఇరుక్కుంటున్నారు . అందులో భాగంగా పోసాని కృష్ణ మురళి దాదాపు నెలరోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది .  ముప్పుతిప్పలు పడితే కానీ బెయిల్ దొరకలేదు .  అదికూడా కండిషన్ బెయిల్ తో బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు తానూ చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నట్టు పోసాని చెబుతున్నా.. కన్నీళ్ల పర్యంతం అవుతున్నా ఆయన పట్ల ఎవరికీ సానుభూతి కలగడం లేదు సరికదా.. కనీసం అయ్యో అనే వారు కనిపించడం లేదు. 

అధికారంలో ఉన్నామనో.. లేకపోతే తామున్న స్థితిలోనే ఎప్పుడూ ఉండిపోతామనో ఎవరైనా భ్రమపడితే.. ఆ మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏమి జరుగుతుంది అనేదానికి పోసాని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పట్లో ప్రతి నాయకునిపై ద్వేషాన్ని కుమ్మరించిన పోసానికి ఇప్పుడు పోలీసులు చుక్కలు చూపించారు. అన్న ప్రతిమాటకు లెక్కలు సరిచేశారు. జైలు కూడు తింటూ తానూ చేసిన తప్పులు ఒక్కోటి గుర్తుకొచ్చి కుమిలిపోయే పరిస్థితి పోసాని కృష్ణ మురళికి వచ్చింది. హుందాతనం లేకపోతే రాజకీయాలేనా.. వ్యక్తిగత జీవితమైనా ఎలాంటి చిక్కుల్లో పడుతుందో పోసానితో పాటు అప్పట్లో రెచ్చిపోయిన నాయకులందరికీ తెలిసి వస్తోంది. 

Mahaa Vamsi: పోసాని కృష్ణ మురళి జైలు ఎపిసోడ్ గురించి మహా వంశీ విశ్లేషణను ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: మద్దిపాడులో జూబ్లీ సెలెబ్రేషన్ కు మహా న్యూస్ సీఎండీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *