Neymar: ప్రపంచంలోనే అతి కొద్ది మంది స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్స్ లో నైమర్ జూనియర్ ఒకడు. చిన్న వయసు నుండే అంతర్జాతీయ ఫుట్ బాల్ లో సత్తా చాటి దిగ్గజాలు అయిన క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సి సరసన నిలిచాడు. అలాగే క్లబ్ లీగ్స్ లో కూడా అద్భుతమైన ఆట కనబరుస్తూ అత్యధిక పారితోషికం అందుకున్న ప్లేయర్ గా కూడా ఎదిగాడు. అయితే ఇప్పుడు అతని కెరీర్ చిక్కుల్లో పడింది. ఆ విషయాల్లో కి వెళ్తే…
బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ప్రస్తుతం సౌదీ క్లబ్ జట్టు అయిన అల్ హిలాల్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఆ జుట్టు తరఫున కేవలం ఏడు మ్యాచ్ లు మాత్రమే ఆడిన నెయ్‌మార్ ఇప్పుడు అక్కడినుండి బయటకు వచ్చేయాలని చూస్తున్నాడు. మొత్తం 104 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ కు ఒప్పందం చేసుకున్న నియమా ప్రస్తుతం ఆ క్లబ్ వీడాలని ఉన్నా… వదిలి వెళ్ళలేని పరిస్థితుల్లో పడ్డాడు. అంతేకాకుండా అతనిని ఈ మధ్యకాలంలో గాయాల బెడద గట్టిగా పట్టుకుంది.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీ వివాదం పై స్పందించిన బిసిసిఐ..!
గతంలోని నెయ్‌మార్ బార్సిలోనా, ప్యారిస్ సెయింట్ జర్మన్ జట్ల తరఫున ఆడాడు. రికార్డు స్థాయిలో బార్సిలోనా నుండి పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ కు మారేందుకు నెయ్‌మార్ ఏకంగా 230 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు. అక్కడ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ముందే సౌదీకి చెందిన క్లబ్ తో భారీ మొత్తంలో ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి ఎడమ కాలు లిగమెంట్ దెబ్బ తినడం… దాని నుండి కోరుకున్న వెంటనే అతి ప్రమాదకరమైన కీళ్ళ సమస్య రావడం వెంటవెంటనే జరిగింది. ఈ సంవత్సరంలో ఈ సౌదీ జట్టు తరుపున అతను కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు దీనికి తోడు ఇప్పుడు ఆ క్లబ్ నుండి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Neymar: బ్రెజిల్ ఫుట్ బాల్ చరిత్రలో 127 మ్యాచ్లలో 79 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ గా రికార్డు ఉన్న నెయ్‌మార్ ఇప్పుడు సౌదీ జట్టు ని వదిలి వెళ్లాలి అంటే అతను ఒప్పందం ప్రకారం చేసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన పని కాగా కాంట్రాక్టుకు సంబంధించి జరిగే ఇబ్బందులు మరిన్ని ఉంటాయి. అయితే నెయ్‌మార్ మాత్రం తన పూర్వ ఫిట్ నెస్ సాధించేందుకు తన దేశంలో ఉన్న ఏదో ఒక సొంత క్లబ్ లో ఆడే ఆలోచనలో ఉన్నాడట. మరి నెయ్‌మార్ అంత మొత్తాన్ని తిరిగి ఇస్తాడా లేదా ఒప్పందం చేసుకున్నట్లు సౌదీ కి చెందిన క్లబ్ తరఫున ఆడుతాడా అన్నది వేసి చూడాలి.