Crime News: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే ఓ కిరాతకుడు కడతేర్చాడు. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా చేసేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన హైదరాబాద్ మీర్‌పేట పరిధిలో చోటుచేసుకున్నది. ఈ ఘోరానికి పాల్పడిన ఘనుడు ఓ రిటైర్డ్ సైనికుడు.
Crime News: ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన గురుమూర్తికి 13 ఏండ్ల క్రితం వెంకటమాధవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీర్‌పేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. సమీపంలోని కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి తన భార్యపై అనుమానం పెంచుకొని తరచూ కొట్టేవాడని స్థానికులు తెలిపారు. పండుగకు ముందు కూడా భార్యను కొట్టగా, ఆమె తన తల్లిదండ్రులకు చెప్పిందని వారు చెప్పారు.
Crime News: ఈ నేపథ్యంలో ముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి పండుగ రోజైన జనవరి 14న తన భార్యను కడతేర్చాలని గురుమూర్తి ప్లాన్ చేసుకున్నాడు. అదే రోజు మళ్లీ గొడవ పడ్డారు. అదే రాత్రి వెంకటమాధవిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తన కూతురు ఫోన్ చేయడం లేదనే బాధతో వెంకటమాధవి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి విచారించారు. ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పడంతో వెంకటమాధవి తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. అల్లుడిని వద్దని చెప్పి అత్తామామలే స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Crime News: ఈ లోగా భార్యను కడతేర్చిన దుండగుడు.. ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో పడ్డాడు. బయట నుంచి వేటను కోసే కత్తులు, కుక్కర్‌ను కొనుగోలు చేసుకొని వచ్చాడు. హతురాలిని ముక్కలుగా కోసి, కుక్కర్‌లో ఉడకబెట్టి ఆనవాళ్లు లేకుండా చేసి సమీపంలోని చెరువులో, మురుగు కాల్వల్లో పడేశాడని అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు హతురాలి భర్త ప్రవర్తనపై అనుమానంతో ఓ కన్నేశారు. సీసీ కెమెరాలు, స్థానికుల ద్వారా పోలీసులకు పలు విషయాలు వెల్లడయ్యాయి. త్వరలో కేసు వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.