Champions Trophy 2025: ఫిబ్రవరి 19వ తేదీ నుండి పాకిస్తాన్ మరియు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇటు భారత క్రికెట్ బోర్డు, అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ… టోర్నమెంట్ లో భారత్ ఆడబోయే మ్యాచ్ లు అన్నిటికీ దుబాయ్ ను వేదికగా చేసింది. అయితే గత రెండు రోజులుగా… కొత్తగా… జెర్సీ వివాదం ఒకటి మొదలు కావడంతో దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆట మొదలు కాకుండానే ముందు వివాదాలు మొదలైపోయాయి. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొనే జట్లు వారి దేశపు జర్సీలపై అఫీషియల్ గా టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తున్న దేశం అయిన పాకిస్తాన్ పేరుని ముద్రించుకోవాలి. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఎందుకు ససేమిరా ఒప్పుకోలేదు అని ఎన్నో వదంతుల వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్… పాకిస్తాన్ దేశపు పేరుని తమ జెర్సీ పై ఉంచుకోదు అని అందరూ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి కొన్ని మీడియా వర్గాల నుండి కూడా వార్తలు చెలరేగాయి.
ఇది కూడా చదవండి:IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం
Champions Trophy 2025: ఇప్పటికే పాకిస్తాన్ 2023లో వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు భారత్ కు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వచ్చింది. కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు మాత్రం భారత్ పాకిస్తాన్ కు వెళ్లేందుకు నిరాకరించింది. ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా దీనిపై స్పందించారు. బయట వస్తున్న వార్తలు అన్నీ అసత్యం అని తమ బోర్డుకు పాకిస్తాన్ పేరు భారత్ జెర్సీ పై ముద్రించుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని… బీసీసీఐ నియమాలకు తాము ఎల్లవేళలా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాడు. తాము కూడా మిగిలిన జట్లతో సమానమని వారు దేనికి సముఖంగా ఉంటే… తమకు కూడా ఆయా విషయాలు అన్నీ అంగీకారమేనని అతను తెలిపారు.
ఇక ఈ స్టేట్మెంట్ తో ఒక పెద్ద వివాదం ముగింపుకు వచ్చేసినట్లు అయింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ప్రతి జట్టు కెప్టెన్ వెళ్లి మీడియాతో సమావేశం అయి… ట్రోఫీతో ఫోటోషూట్ లో పాల్గొనవలసి ఉంటుంది. మరి ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ను భారత క్రికెట్ బోర్డు ఎట్టి పరిస్థితుల్లో పంపే అవకాశాలు లేవనే తెలుస్తోంది. మరి దీనిపై మళ్లీ పిసిసి, బీసీసీఐ ఎలా స్పందిస్తుంది అన్న విషయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.