kukatpally Woman Murder Case

Kukatpally Woman Murder Case: మహిళను హత్య చేసి – రేప్​ సీన్​గా క్రియేట్ చేసిన కి’లేడీ

Kukatpally Woman Murder Case: కష్టం ఒకరిని..కొట్టేయాలని కోరిక ఇంకొకరిది. అందుకోసం ఓ స్కెచ్. అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటె ..సొమ్మంతా ఆమెకే . కానీ..ఓ కన్నింగ్ ఐడియా కటకటాల్లోకి వెళ్లేలా చేసింది. కస్టపడి సంపాదించడం రాదు కానీ…షార్ట్ కట్ లో కొట్టేయాలని ఆలోచన మాత్రం …చాలానే ఉంది. ఇంతకీ ..ఓ కిలాడి ..ఓ లేడీని చంపడానికి వేసిన స్కెచ్ ఏంటి. వేసిన ఆ స్కెచ్ ఎలా బయటకు వచ్చింది. రోడ్డు పక్కన నిద్రించే ఆమెపై …ఇంకో మహిళా కన్ను ఎలా పడింది.

ఓ మహిళను హత్య చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సంఘటనా స్థలాన్ని రేప్ సీన్​గా మార్చిన ఓ కి’లేడీ’ని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు. ఈ సందర్భంగా మహిళ హత్య వివరాలను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్‌ వెల్లడించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక అనే మహిళ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. కేపీహెచ్​బీలో ఉంటూ, రాత్రుళ్లు ఫుట్​పాత్​పై నిద్రించేది.

ఆ సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది. రోడ్డుపై ఉంటున్న తనకు భద్రత లేదని, తన వెండి ఆభరణాలను మంజుల వద్ద భద్రపరిచింది. కొద్ది రోజులకు తన వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని ప్రియాంక కోరగా, మంజుల వెనక్కి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియాంక మంజులతో నీ అంతు చూస్తానని బెదిరించి, వెండి ఆభరణాలు ఆమె నుంచి తిరిగి తీసుకుంది.

తనకు ప్రియాంకతో ప్రాణహాని ఉందని భావించిన మంజుల, ఆమెకు గత నెల 30వ తేదీన మద్యం తాగించి, కేపీహెచ్​బీలోని లోథా అపార్ట్​మెంట్స్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్లి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం ప్రియాంకను ఎవరో రేప్ చేసి, హత్య చేసినట్లుగా ఘటనా స్థలాన్ని చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యింది.

ఇటీవల ప్రియాంక మృతదేహం లభించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు దర్యాప్తులో ఈ తతంగమంతా బయటపడింది. హత్యకు పాల్పడిన కిలాడీ లేడీ మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. ప్రియాంక హత్య కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ సురేష్‌ అభినందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Miss World 2025: హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *